Mom Killed Four Years Daughter: మామూలుగా పిల్లలను ఎవరైనా కొడితేనే చూసి తట్టుకోలేము. అలాంటిది చాలా చిన్న కారణానికే చంపేస్తే...అది కూడా తల్లే..తన కన్న కూతురిని దారుణంగా కొట్టి చనిపోయేట్టు చేస్తే...వినడానికే చాలా విషాదంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలోనే హామిల్టన్ కౌంటీలో జరిగింది. అక్కడ ఉండే టియానా రాబిన్సన్ అనే ఆమె తన నాలుగేళ్ళ కూతురిని అత్యంత క్రూరంగా హింసించింది. దీనివలన ఆ పాప నరకయాతన అనుభవించింది. అచివరకు ప్రాణాలను కూడా వదిలేసింది.
పక్కలో పాస్ పోస్తే నేరమా..
టియానా రాబిన్సన్, నహ్లా మిల్లర్ తల్లీ కూతుళ్ళు. వీరిద్దరు హామిల్టన్ కౌంటీలో ఉంటారు. టియానాకు 28ఏళ్ళు, నహ్లాకు 4ఏళ్ళు. పాపకు పక్కలో పాస్ పోసే అలవాటు ఉంది. టియానా దాన్ని మానిపించడానికి ప్రయత్నించింది. అయితే కొంతమంది పిల్లలకు ఈ అలవాటు కాస్త పెద్ద అయితే కానీ పోదు. అయితే టియానాకు ఈ విషయం తెలీదో లేక అంత ఓపిక లేదో కానీ...నహ్లాను విపరీతంగా కొట్టింది. పక్క మీద పాస్ పోసిందని దారుణంగా హింసించింది. అంతేకాదు ఏకంగా గొంతు కోసేసింది. ఈ దాడిలో నహ్లా చేయి విరిగింది. మెదడుకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. దీంతో పాప చనిపోయింది. ఈ సంఘటన 2021లో జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు మూడు ఏళ్ళ తర్వాత హామిల్టన్ కౌంటీ టియన్నా కేసును విచారించి శిక్షను ఖరారు చేసింది.
30 ఏళ్ళ జైలు శిక్ష..
టియన్నా చేసిన పనిని దారుణంగా అభివర్ణించారు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ మెలిస్సా పవర్స్. నహ్లా పరిస్థితి తలుచుకుంటే కడుపులోంచి బాధ తన్నుకొస్తుందని వ్యాఖ్యానించారు. అంత బాధను ఆ చిన్న ప్రాణం ఎలా తట్టుకుందో అంటూ విచారం వ్యకతం చేశారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన టియన్నాకు అంతకంటే ఘోరమైన శిక్ష వేయాల్సిందేనని అన్నారు. ఆమెకు ౩౦ సంవత్సరాల జైలు శిక్షను విధించారు. అది కూడా పెరోల్ ఇవ్వనటువంటి శిక్షను వేశారు. టియన్నాకు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని..దాని వలనే ఆమె అంత దారుణంగా ప్రవర్తించిందని కోర్టు తెలిపింది. అయినా కూడా ఆమె శిక్షకు అర్హురాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Also Read:జోరుమీదనున్న మెగా డాటర్..యమ్మీ కబుర్లు అంటున్న నిహారికా