Face Tips : సీజన్‌తో సంబంధం లేకుండా ముఖానికి మాయిశ్చరైజర్(Face Moisturizer) చాలా ముఖ్యం. కొన్నిఫేస్ సీరమ్(Face Serum) మంచిదో, వాటిని ఎప్పుడు ఉపయోగించాలో కొందరి అర్థం కాదు. ప్రస్తుత కాలంలో మార్కెట్లో చాలా రకాల చర్మ సంరక్షణ క్రీములు(Skin Lotions) ఉన్నాయి. వాటిల్లో ఏది వాడుకోవాలో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రతి క్రీముల వలన మంచి లాభం ఉందని చెప్పినా..!! చర్మానికి ఏది సరైనది..? అనేదాన్ని ఎంపిక చేసుకోవడం అంత సులభం కాదంటున్నారు బ్యూటీ నిపుణులు. ముఖానికి ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ముఖ్యానికి మాయిశ్చరైజర్ అవసరమంటే..?
- ముందుగా చర్మ అవసరాలను(Skin Needs) అర్థం చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాలి. ఇలాంటి వాడేముందు కొంత పరిశోధన, అవగాహన అవసరం. తద్వారా చర్మాన్ని బాగా చూసుకోవచ్చు అంటున్నారు.
- మాయిశ్చరైజర్ అనేది ముఖానికి తేమను అందించి మృదువుగా ఉంచే ఒక రకమైన క్రీమ్. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.
- వీటిని వాడినప్పుడు ఫేస్ సీరం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది ముఖానికి తేలికైనది, చర్మంలోకి లోతుగా పనిచేసే మరింత తేమను కలిగి ఉంటుంది. ముడతలు, నల్ల మచ్చలు, చర్మం పొడిబారడం వంటి నిర్దిష్ట చర్మ సమస్యలను తొలగించడంలో సీరం వంటి ఎక్కువగా మేలు చేస్తాయి.
- ముఖాన్ని మృదువుగా, తాజాగా ఉంచుకోవాలనుకుంటే.. మాయిశ్చరైజర్ సరైనదంటున్నారు. మాయిశ్చరైజర్ అనేది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి మృదువుగా ఉంచే క్రీమ్. ఇది చర్మాన్ని పొడిబారకుండా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
- ముఖంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి కొన్ని కఠిన చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఫేస్ సీరమ్‌తో వాటిని మెరుగుపరుచుకోవచ్చు. ఫేస్ సీరమ్ అనేది చాలా చురుకైన పదార్ధాలను కలిగి ఉన్న తేలికపాటి ద్రవం. ఇది చర్మంలోకి లోతుగా పని చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : వామ్మో.. వచ్చే 25 సంవత్సరాలలో 100 కోట్ల మందికి ఈ వ్యాధి గ్యారెంటీ
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి : ఏడాదికి ఒకసారైనా ఈ రక్త పరీక్ష చేయించుకోండి