ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ చరణ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ ఆయన్ని ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిద ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మాంఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒడిశాలో 24 ఏళ్ల పాటు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పాలనకు బ్రేక్ పడింది.
Also Read: సర్పంచ్ నుంచి సీఎం దాకా.. మోహన్ చరణ్ మాఝీ పొలిటికల్ జర్నీ
రాష్ట్రంలో మొత్తం 147 సీట్లలో బీజేపీ 78 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బీజేడీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. దీంతో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ‘మోహన్ చరణ్ మాఝీ’ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాంఝీకి.. చివరికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.
Also Read: భారీ వర్షాలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!