Kalki 2898AD : ప్రభాస్ బావ 'కల్కి' చూశాను, మహాద్భుతం : మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కల్కి సినిమాపై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేస్తూ.." ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు" అని తెలిపారు.

New Update
Kalki 2898AD : ప్రభాస్ బావ 'కల్కి' చూశాను, మహాద్భుతం : మోహన్ బాబు

Mohan Babu About Prabhas Kalki Movie : ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి2898AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తగా.. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సినిమా చూసి తన అనుభూతిని పంచుకున్నారు.

మహాద్భుతం...

మోహన్ బాబు (Mohan Babu) కల్కి సినిమాపై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేస్తూ.." ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ లో ప్రభాస్ ను అయన బావ అని పిలవడం ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబు ప్రభాస్ ను ప్రేమగా బావ అని పిస్తుంటాడు. దానికో స్టోరీ ఉంది..

Also Read : వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్.. ప్రభుదేవాతో మంచు విష్ణు సెలెబ్రేషన్స్, వీడియో వైరల్!

ఆ సినిమా నుంచి...

ప్రభాస్, మోహన్ బాబు కలిసి 'బుజ్జిగాడు' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు త్రిషకు అన్నయ్యగా నటించారు. అంటే ప్రభాస్ కు బావ అన్నమాట. ప్రభాస్ కూడా సినిమా క్లైమాక్స్ లో మోహన్ బాబును బావ అని పిలుస్తాడు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో మోహన్ బాబు రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ ను బావ అంటూ ఆటపట్టిస్తూ ఉంటాడు.

Advertisment
తాజా కథనాలు