MP Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా ఇండియా కూటమి సంయుక్త ర్యాలీని ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ.. "నేను, అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమి గత రెండేళ్లలో తాము చేయాల్సినవన్నీ చేశామని అన్నారు. భారత్ జోడో యాత్ర, నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ (ద్వేషం మధ్య కూడా ప్రేమను పంచడం), న్యాయ యాత్ర, ఇండియా కూటమి సమావేశాలు దేశ ప్రయోజనాల కోసం ఇలా ఎన్నో చేశాం" అని అన్నారు.
ALSO READ: సీఎం కేజ్రీవాల్ కు బెయిల్
రాసి పెట్టుకోండి.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని.. మోదీ ఇక ప్రధాని అయ్యే అవకాశం లేదని అన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమిలోని ఇతర పార్టీల కార్యకర్తలు కలిసి పని చేసి, కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గంలో అఖిలేష్ యాదవ్‌ను గెలిపించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
“నరేంద్ర మోదీ 22 మంది కోసం పని చేస్తారు... ఆ 22 మంది దగ్గర 70 కోట్ల మంది దగ్గర ఉన్న డబ్బుతో సమానం... మోదీ 22 మందిని కోటీశ్వరులను సిద్ధం చేయగలిగితే, మేము కోట్లాది మందిని లక్షాధికారులను చేయగలం. నిరుపేద కుటుంబాల జాబితా సిద్ధం చేస్తాం...ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదు.పేదలందరి జాబితాను తయారు చేసి, ఈ పేద కుటుంబంలో ఒక్కో మహిళ పేరును ఎంపిక చేస్తారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆ మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.8500 జమ చేస్తాం" అని అన్నారు.