పెయింటర్ గా మారిన రాహుల్ గాంధీ
తనపై త్వరలో ఈడీ దాడులు జరగొచ్చని సంచలన ట్వీట్ చేశారు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఓ అధికారి తనకు ఈ సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. ఈడీ రైడ్స్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. తాను వీటికి భయపడే వాడిని కాదని అన్నారు.
లోక్ సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అన్నారు రాహుల్ గాంధీ. దేశ అభివృద్ధి అంశాలపై మాట్లాడేందుకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. కాగా లోక్సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు రాహుల్, మోదీని సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని అన్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం నిర్మూలించడమే తమ ఎజెండా అని అన్నారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8500 జమ చేస్తామన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని అన్నారు రాహుల్ గాంధీ. మోదీ ఇక ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల భర్తీ ప్రక్రియను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపకు రాహుల్ గాంధీ రానున్నారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు కడపలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
TG: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోపై రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే హరీష్ లేఖ రాశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చినట్లు మరోసారి పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ ప్రజలను మోసం చేయొద్దు అని అన్నారు.