PM Modi: జూన్ 1న లోక్‌సభ తుది దశ ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

జూన్ 1న జరగనున్న లోక్‌సభ ఏడో దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీచేయనున్న వారణాసి స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును క్రియెట్ చేయాలని పిలుపునిచ్చారు.

New Update
PM Modi: జూన్ 1న లోక్‌సభ తుది దశ ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

జూన్ 1 లోక్‌సభ ఏడో దశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈరోజు (గురువారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు కూడా ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీచేయనున్న వారణాసి స్థానం కూడా ఉంది. అయితే ఈ చివరి పోలింగ్‌కి ముందు ప్రధాని.. ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీ నగరం భక్తి, శక్తికి ప్రతీక అని.. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని అన్నారు.

Also read: ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. బరిలో మోదీ, కంగనా

కాశీ ప్రతినిధిగా బాబా విశ్వనాధ్‌తో సహా కాశీ ప్రజల ఆశీస్సులు కోరుతున్నానని పేర్కొన్నారు. ఈసారి కాశీ ఎన్నికలు నవకాశీ ఏర్పాటు కోసమే కాదని.. అభివృద్ధి చెందిన భారత్‌ ఆవిష్కరణకు కీలకమని తెలిపారు. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును క్రియెట్ చేయాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా కాశీ.. సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. నేను నామినేషన్ వేసిన రోజున ఇక్కడి యువత ఉత్సాహం చూశానని.. అలాంటి ఉత్సాహమే పోలింగ్ బూత్‌లో కూడా కనిపించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్‌ మెషినే పేలిపోయింది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు