ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో.. ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూళ్లలో ఏప్రిల్ 21న పరీక్ష జరిగింది. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి మార్కుల మెమోను పొందవచ్చని తెలిపారు.
Also Read: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
ఇక అడ్మిషన్లకు సంబంధించి మరింత సమాచారం కోసం ఆయా మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు.
Also Read: ఇవాళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో.. ప్రధాన అంశాలు ఇవే