CM Jagan : సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ

సీఎం జగన్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్. తాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. పార్టీలో కష్టపడ్డా నాయకులను గుర్తింపు లేదని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వంశీ రాసిన లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

AP Elections: 10 మంది టచ్ లో ఉన్నారు.. ఎమ్మెల్సీ వంశీ సంచలన వ్యాఖ్యలు!
New Update

MLC Vamshi Krishna : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ(YCP) కి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్(Vamshi Krishna Yadav) సీఎం జగన్(CM Jagan) కు సంచలన లేఖ రాశారు. తాను వైసీపీ పార్టీ కి ఎందుకు రాజీనామా చేసి.. జనసేన పార్టీ లో చేరడానికి గల కారణాలను వివరిస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు. తాను పార్టీలో ఎదురుకున్న సమస్యలను లేఖలో వివరించారు.

ALSO READ: జనవరి 1నుంచి పెన్షన్ రూ.3,000 పంపిణీ షురూ!

ఎమ్మెల్సీ వంశీ కృష్ణ సీఎం జగన్ రాసిన లేఖలో.. తన రాజీనామా వెనక ఎన్నో అవమానాలు, ఎంతో ఆవేదన ఉందని పేర్కొన్నారు. తన తండ్రి మరణించారన్న బాధను పక్కన పెట్టి మీ( జగన్) పై అభిమానంతో వైసీపీ లో చేరినట్లు తెలిపారు. ఎంత కష్టపడి పని చేసినా కనీసం నన్ను మనిషిలా కూడా చూడలేదని తన బాధను వ్యక్త పరిచారు. పార్టీ కోసం ఖర్చు పెడితే నా వ్యాపారాలు అన్నీ దెబ్బ తీశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే టికెట్, మేయర్ పదవి రాకుండా అడ్డు పడ్డారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, ధనుంజయరెడ్డికి ఎన్ని సార్లు నా సమస్యలు చెప్పినా పట్టించుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు(సీఎం జగన్) జైలులో ఉన్నప్పుడు 6 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా నడిపించానని.. నా సొంత నిధులతో పార్టీ ఆఫీసులో జీతాలు చెల్లించి, జెండాలు కట్టించి మీటింగులు పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. 2019 ఎన్నికల కోసం మొత్తం సమాయత్తం అవుతున్న సమయంలో నోటిఫికేషన్ రోజు తనను తొలగించారని అన్నారు. గెలుపు అవకాశం ఉన్న తనను పక్కన పెట్టడం వలన తీవ్ర నిరాశ చెందినట్లు పేర్కొన్నారు. చాలా సార్లు మిమ్మల్ని (సీఎం జగన్) కలిసి సమస్యలు చెప్పుకుందాం అనుకున్నాను.. కానీ మిమ్మల్ని కలవనివ్వలేద అంటూ లేఖలో తన ఆవేదనను వ్యక్త పరిచారు. కొంతమంది నేతలు చెప్పిన మాటలు విని నన్ను దూరం పెట్టారు.. కింది స్థాయిలో ఉన్న నేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఇలా అన్ని అంశాలు ప్రస్థావిస్తూ 11 పేజీల లేఖ రాశారు.

ALSO READ: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ

#mlc-vamshi-krishna #pawan-kalyan #janasena #ap-latest-news #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe