Kavitha: పెన్షన్ల ఊసే లేదు.. కాంగ్రెస్‌పై కవిత గరం!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. జనవరి ఒకటో తేది నుంచి రూ.4వేలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

MLC Kavitha: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు.

ALSO READ: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు

కేంద్రంపై ఒత్తిడి..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఎందుకు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజైన్ మార్చనప్పుడు ఆయకట్టు పెంచనప్పుడు ఎందుకు టెండర్లు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు మిగిలిన అనుమతలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు.

ప్రధాని మోడీతో (PM Modi) కేసీఆర్ కు (KCR) సత్సంబంధాలు లేవు కాబట్టి జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, మరి ప్రధాని సత్సంబంధాలు పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జాతీయ హోదా సాధించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగిలిన అనుమతులు, జాతీయ హోదా తీసుకొచ్చే అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

పెన్షన్ల ఊసే లేదు...

జనవరి 1న పెన్షన్లను పంపిణీ చేయాల్సింది ఇప్పటి వరకు పెన్షన్ల ఊసే లేదని.. ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, రైతు బంధు నిధుల పంపిణీ ప్రస్తావనే లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా పాలనలో భాగంగా కోటి 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థమవవ్వడం లేదని చెప్పారు.

దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 44 లక్షల మందికి కేసీఆర్ హయాంలో పెన్షన్లు అందించిందని, వారికి పెన్షన్ల మొత్తం పెంచి పంపిణీ చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారని లేవనెత్తారు.

ALSO READ: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు