Rythu Bandhu: కాంగ్రెస్‌ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత

కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ రైతు బంధును ఆపివేయించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.

New Update
Rythu Bandhu: కాంగ్రెస్‌ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు పంపిణీకి ఇచ్చిన పర్మిషన్‌ను వెనక్కితీసుకున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ కాంగ్రెస్ నేతలు రైతు బంధును ఆపివేయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడి ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. ఉపాధి హామీ నిధులకు కేంద్ర ప్రభుత్వం భారీగా కోతలు విధించిందని.. ఈ పథకంలో కూలీలకు సగటున రూ.150 కూడా రావడం లేదని కవిత ఆరోపించారు. వేలాది మంది కూలీల పొట్టగొడుతున్న బీజేపీని కాంగ్రెస్‌ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ధ్వజమెత్తారు.

Also Read: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్..

అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నాయని.. రైతుబంధు కావాలా? రాబందులు కావాలా?.. 24 గంటల కరెంట్ కావాలా ? మూడు గంటల కరెంట్ కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని తెలిపారు.

Also read: విదేశాల్లో పెళ్లిల్లు ఎందుకు జరుపుకుంటున్నారు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు