MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం

TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
MLC Kavitha : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం

BRS MLC Kavitha Health : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో అరెస్టై తీహార్ జైలు (Tihar Jail) లో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోగ్యం క్షీణించింది. ఆమె 10 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. చాలా నీరసంగా ఉన్నట్లు సమాచారం. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత అనారోగ్యంపై భర్త అనిల్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఎయిమ్స్‌లో కవితను చూసి అనిల్‌ భావోద్వేగం గురయ్యారు. 4 నెలల్లో పది కిలోల బరువు తగ్గింది కవిత. జైలులో దోమలు ఎక్కువగా ఉన్నాయని కవిత చెబుతోంది. కవితకు డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా టెస్ట్‌లు చేశారు వైద్యులు. పరీక్షల తర్వాత తిరిగి జైలుకు తరలించారు.

కోర్టు ఆదేశాలు..

ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి రిఫర్ చేసింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది.

Also Read : తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!



Advertisment
తాజా కథనాలు