Letter To Court : లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడి నేటితో ముగిసింది. ఆమెను ఈడీ.. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో హాజరుపరిచగా.. మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ని పొడిగించింది. ఈ నేపథ్యంలో కవిత కోర్టుకు ఇచ్చిన లేఖలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ' ఈ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను ఎవరి నుంచి కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందలేదు. ఓ మహిళా రాజకీయ నేతగా ఈ కేసు వ్యవహారంలో నేను బాధితురాలినయ్యాను. ఇది నా వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. నా వ్యక్తిగత మొబైల్ ఫోన్ నెంబర్‌ను అన్ని ఛానళ్లలో చూపించి.. నా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు.
Also Read: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..
లిక్కర్ స్కాం కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) రెండున్నరేళ్లపాటు నన్ను విచారణ జరిపాయి. జైల్లో ఉన్నప్పుడు సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు. విపక్షాలను టార్గెట్ చేయటమే ఈ కేసు ఉద్దేశం. నేను తప్పు చేసినట్లు ఆధారాలు కూడా లేవు. ఇది నాపై రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసు. ఈ కేసు విషయంలో నన్ను బలిపశువును చేశారు. అన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చాను. వేరే వ్యక్తులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్టు చేశారు. నేను ప్రతిసారి కూడా విచారణకు సహకరించాను. అన్ని ఫోన్లు, బ్యాంక్ అకౌంట్, బిజినెస్ వివరాలన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చాను. ప్రస్తుతం నా కొడుకు పరీక్షలు జరుగుతున్నాయి. నేను లేకపోవడం వల్ల అతనిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరోసారి నా బెయిల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోండి ' అంటూ కవిత లేఖలో పేర్కొన్నారు.
Also Read : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్..!