Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన చెంగిచెర్ల వెళతానని ప్రకటించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హోళీ రోజు చెంగిచెర్లలోని దాడి బాధితులను పరామర్శించేందుకు రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని అన్నారు.

New Update
Telangana : డ్రగ్స్‌ను కంట్రోల్ చేయండి-ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh House Arrest: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్..చెంగిచెర్ల కు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని ప్రకటించారు. అయితే దీని మీద ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనను ఎన్ని రోజులు ఇలా హౌస్ అరెస్ట్ చేసి నన్ను నిలువరిస్తారు అంటూ మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే భయమెందుకని పోలీసులను రాజీసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కేసిఆర్ ఏడో నిజాం లా పరిపాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా అదే చేస్తున్నారు. పరిపాలనలో కేసిఆర్, రేవంత్ కి మధ్య పెద్ద తేడా ఏమీ కనపడటం లేదని విమర్శించారు.

చెంగిచర్లలో (Chengicherla) ఒక వర్గానికి చెందిన వందల మంది హిందువుల మీద దాడి జరిగితే .. తుతు మంత్రంగా కొంత మంది కేసు పెట్టీ .. పోలీసులు చేతులు దులుపుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల మీద దాడి జరిగితే...వారి మీదనే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. మా హిందువులపై పెట్టిన కేసుల్ని ఎత్తేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

తాను హిందూ మహిళలను పరామర్శించడానికి మాత్రమే చెంగిచెర్ల వెళుతున్నానని స్పష్టం చేశారు రాజాసింగ్. తనను పోలీసులు అడ్డకువడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. హిందూ మహిళలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని తెలిపారు.

Also Read:Nirmala Sitaraman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు