ఎమ్మెల్యే రాజాసింగ్ మరో స్టాండప్ కమెడియన్‌ని టార్గెట్ చేశారు. జైన్ - ముస్లీం కాన్సెప్ట్‌తో ఇటీవల షో చేసిన డేనియల్ ఫెర్నాండేజ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనుల్ని కించపరిచేలా మాట్లాడాడంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల ఈద్ సందర్భంగా మూగజీవాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో.. జైనులు ముస్లిం వేషధారణలో మేకల్ని కొనుగోలు చేశారు. ఈ ఘటనపైనే డేనియల్ కామెడీ షో చేశారు.
Also Read: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు..
జైనుల్ని కించపరిచేలా డేనియల్ ఈ షో చేశాడని రాజసింగ్ మండిపడ్డారు. అయితే ఈరోజు హైదరాబాద్‌లో డేనియల్ స్టాండప్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో షో క్యాన్సిల్ చేసుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు. లేదంటే చెప్పు దెబ్బలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా ఓ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుక్.. రాముడిని కించపరిచారంటూ అతడిపై రాజాసింగ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: అంతా వాళ్లే చేశారు.. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు