YS Jagan : ప్రొద్దుటూరు(Proddutur) వైసీపీ(YCP) ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల నిన్న మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ(Congress Party) అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టింది. రాజశేఖర్ రెడ్డి అవమానరపంగా మాట్లాడినందుకు.. అసెంబ్లీలో వివేక చేయి చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి, జగన్‌లను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించింది. కాంగ్రెస్ పార్టీలో నువ్వ(షర్మిల) నైతికంగా చనిపోయావు.
Also Read: ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు
రాజశేఖర రెడ్డిని, జగన్ ను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులో పెట్టి జైలుకు పంపింది. కాంగ్రెస్ పార్టీలో చేరి నువ్వు నైతికంగా చనిపోయావు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి ప్రజా కోర్టులో ఓటమి చెందినా.. కోర్టులో నేరం రుజువు అయినా నేను రెఫరెండంగా భావించి రాజకీయాల నుండి నిష్క్రమిస్తాను. క్యాలెండర్ మారేలోపు.. నువ్వు పార్టీ మార్చేశావు. మేము నిన్ను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు. నువ్వు రాజశేఖరర్ రెడ్డి బిడ్డవు కాదు, జగన్ ఒక్కడే రాజశేఖర్ రెడ్డి బిడ్డ' అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.
ఇదిలాఉండగా.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also read: పెన్షనర్ల పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం