MLA Harish Rao: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్‌ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
MLA Harish Rao: వెంటనే రుణమాఫీ చేయాలి.. సీఎం రేవంత్‌కు హరీష్ లేఖ

MLA Harish Rao: తెలంగాణలో అధికార కంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులపై వివాదం ఇంకా చల్లారలేదు. మరోసారి ఇదే విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్‌ సర్కారుకు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.

ALSO READ: శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదే విషయమై తెలంగాణ భవన్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి కనిపించాయని, అంతకు మించి మరేమి లేదని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి మాట్లాడిన ధోరణి చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు చేయబోనని ఉదయం చెప్పిన సీఎం, సాయంత్రానికల్లా మాటతప్పారని మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌ను నీచమైన పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రాజెక్టుల అప్పగింత విషయంలో రేవంత్‌ ఎన్ని మాటలు చెప్పినా సారాంశం ఒకటే.. పదేండ్లలో కేసీఆర్‌ కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి రాగానే అప్పనంగా అప్పగించేసింది. అది దాచేసినా దాగని సత్యం’ అని వెల్లడించారు.

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు