AP POLITICS:సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం VS మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి మధ్య  మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు.

New Update
AP POLITICS:సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం VS మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా  మారాయి. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల అసంతృప్తి సెగలు రాజుకుంటూ ఉండగా పార్టీలో అంతర్గత విబేధాలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి మధ్య  మాటల యుద్ధం జోరుగా సాగుతోంది.  కోనేటి ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు.సత్యవేడు లో మట్టిమాఫియా కి అనుమతులు ఆదిమూలంకు తెలియకుండానే , ఆయన భాగస్వామ్యం లేకుండా జరుగుతోందా అని  నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కోనేటి ఆదిమూలంకు  వైసిపి సముచిత స్థానం కల్పించినా కూడా పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం  సరైన పద్ధతి కాదన్నారు.

తెదేపాతో  ఆదిమూలం కుమ్మక్కు 

తిరుపతి లో జరిగిన సమన్వయ సమావేశానికి ఆరోగ్యం భాగాలేదని రాలేకపోతున్నా అని చెప్పి తనయుడు సుమన్ ను పంపడం నిజం కాదా..? 70 వేల మెజార్టీతో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని గెలిపిస్తామంటూ  అక్కడ సుమన్ మాట్లాడటం నిజం కాదా..?అంటూ ప్రశ్నించారు. తెదేపా నుంచి రాబిన్ శర్మ టీమ్ ఆదిమూలం ను కలిసిన తర్వాత వారితో ఆదిమూలం కుమ్మక్కైనట్లు తెలుస్తోందన్నారు. ఆదిమూలం ఏపార్టీలో చేరీనా రాబిన్ శర్మ టీమ్ కలిసిన తర్వాత ఎందుకు వారితో కుమ్మక్కై నిరాధార ఆరోపణలు చేశారో సత్యవేడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

నాపై భౌతికదాడులు చేయించారు -  సత్యవేడు ఉపసర్పంచ్ సెంథిల్

ఇక.. ఎమ్మెల్యే తనయుడు సుమన్ తనను ఇంటికి పిలిపించి భౌతికదాడులు చేయించారని సత్యవేడు ఉపసర్పంచ్ సెంథిల్ వాపోయారు.గత ఎన్నికల్లో ఎంతగానో సహాయసహకారాలు అందించినప్పటికి , డబ్బుడబ్బు అంటూ వేధించేవారని ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బలహీన సామాజికవర్గానికి చెందిన వాడిననే దుర్భాషలాడే వారని ,అలాంటి వారు పార్టీ పెద్దలపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

ఆదిమూలం,పెద్దిరెడ్డిల మధ్య  విబేధాలు ఎందుకు 

టికెట్ల కేటాయింపులో పెరుగుతున్న అసంతృప్తివల్లే కోనేటి ఆదిమూలం,పెద్దిరెడ్డిల మధ్య ఈ వార్ జరుగుతోంది. కోనేటి ఆదిమూలం..బాహటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఇంతవరకు సత్యవేడుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఆదిమూలంను వైఎస్ జగన్  తిరుపతి లోక్‌సభ ఇన్‌ఛార్జీగా అపాయింట్ చేసి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడు అభ్యర్థిగా ఖరారు చేయడంతో  కోనేటి ఆదిమూలం అసంతృప్తికి గురయ్యారు. తన స్థానాన్ని మార్చడానికి నూటికి నూరు శాతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమని ఆరోపించారు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకుంటున్నాయి.

ALSO READ: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.!

Advertisment
Advertisment
తాజా కథనాలు