నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి....!

మిజోరాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్క సారిగా కూలి పోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

author-image
By G Ramu
New Update
నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి....!

మిజోరాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్క సారిగా కూలి పోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.

ఘటన జరిగే సమయానికి వంతెన కింద 40 మంది పని చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు `17 మృత దేహాలను వెలికి తీసినట్టు వెల్లడించారు. ఇంకా కొందరు శిథిలాల కింది చిక్కుకుని ఉన్నట్టు వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెనను నిర్మిస్తున్నారు. ఈ శాన్య భారత్ లోని అన్ని రాష్ట్రాలను కలిపేందుకు ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఘటనకు గల కారణాలు ఏంటనే విషయం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో వంతెన కింద ఎంత మంది ఉన్నారు అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని పౌరసంబంధాల అధికారి సవ్యసాచి అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. అంతకు ముందు ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ ఘటనపై మిజోరాం సీఎం జోరంతంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వంతెన కూలిన ఘటన గురించి తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానన్నారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీలు కూడా ఉన్నారు. దీంతో ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ సీఎం కూడా దీనిపై స్పందించారు. మిజోరాం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎస్ ను ఆదేశించానన్నారు.

Advertisment
తాజా కథనాలు