Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు..

వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్‌ స్పందించారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని వ్యాఖ్యానించారు.

New Update
Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు..

వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ' మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు. మత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాల్సింది పోయి సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరికాదు. విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తులుగా చేస్తామంటే కుదరదు.

Also Read: హరీశ్ రావు ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి విలువైన భూములను కాజేయ్యాలని జగన్ చూశారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. త్వరలోనే పార్లమెంట్ కమిటీ భేటీ అవుతుంది. మార్పులు చేర్పులు చేశాక చూస్తాం. వక్ఫ్ సవరణలపై భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దేశమంతా మనవైపే చూస్తోందని సీఎం చంద్రబాబుకు చెప్పాము. అందుకే చట్ట సవరణ నిలుపుదల చేయించామని' మంత్రి ఫరూఖ్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు