పాకిస్థాన్‌లో ఓ అమానుష సంఘటన జరిగింది. 72 ఏళ్ల వయసున్న ముసలాయనతో 12 ఏళ్ల మైనర్ బాలికకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయానికి పోలీసులు వచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తండ్రి తప్పించుకోగా.. వృద్ధ పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక తండ్రి ఆలమ్ సయిద్.. రూ.5 లక్షలకు ఆశపడి ఆమెను వృద్ధుడికి అమ్మెసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి కొడుకుని అరెస్టు చేశామని.. ఆలమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే పెళ్లి జరిపించడానికి వచ్చిన నిఖ్ఖా ఖ్వాన్‌పై చైల్డ్ మ్యారెజ్ యాక్ట కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
Also Read: ఈవీఎంలు వాడొద్దు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలాఉండగా.. పాకిస్థాన్‌లో బాల్య వివాహాలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ఇటీవల పంజాబ్‌లోని రాజన్‌పూర్‌లో 40 ఏళ్ల వ్యక్తికి 11 ఏళ్ల బాలికతో పెళ్లి చేశారు. థాట్టాలో 50 ఏళ్ల భూస్వామితో మైనర్ బాలికకు పెళ్లి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్వాత్‌లో 13 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ 70 ఏళ్ల వృద్ధుడిని అరెస్టు చేశారు.
Also Read: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా