Rythu Bandhu: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్‌ రావు ఫైర్..

రైతు బంధు పంపిణీని ఆపాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీఐకి ఫిర్యాదు చేశారని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. డిసెంబర్‌ 3 తర్వాత మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని.. అప్పుడు రైతుల ఖాతాల్లో యథావిథిగా రైతుబంధు డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.

New Update
Rythu Bandhu: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్‌ రావు ఫైర్..

Harish Rao: రైతుబంధు పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడంతో.. మంత్రి హరీష్‌ రావు స్పందించారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతుబంధుకు ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పంపిణీపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ నేత నిరంజన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఎన్నిరోజులు మీరు ఆపుతారు అంటూ కాంగ్రెస్‌ నేతలపై ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 3 తర్వాత అధికారంలోకి మళ్లీ వచ్చేది కేసీఆరేనని.. అప్పడు రైతు బంధు (Rythu Bandhu) నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌ మాట్లాడారు.

Also Read: కాంగ్రెస్‌ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత

కాంగ్రెస్‌ (Congress) వాళ్లు రైతులకు ఇవ్వరు.. ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతారంటూ మండిపడ్డారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌కు ఉన్నది ఓటు బంధం కాదని.. పేగుబంధమని వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా రైతుబంధు ఇచ్చామని.. ఓట్ల కోసం కాకుండా రైతులపై ప్రేమతో 11 సార్లు కేసీఆర్‌ (KCR) రైతు బంధు ఇచ్చారని అన్నారు. ఒక ఎకరానికి రూ.16వేల ఇస్తానని కేసీఆర్ అంటే.. రైతుకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందన్నారు. వారికి ఓట్లతోనే పోటు పొడవాలని.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగిపోతుందని తెలిపారు.

Also Read: తక్కువ ధరలకు లిక్కర్ విక్రయిస్తే రూ.4 లక్షలు జరిమానా..

Advertisment
Advertisment
తాజా కథనాలు