Minister Uttam Kumar Reddy: నీటి పారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మించిన స్థలం సరికాదని అన్నారు. వైట్‌పేపర్‌లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదికను పొందుపరిచినట్లు తెలిపారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కుంగిందని అన్నారు. రాఫ్ట్ కుంగడంతో పియర్స్‌కు కూడా కుంగిపోయాయని తెలిపారు.
ALSO READ: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్.. నీళ్లు లీక్!
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదు..
మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లో పియర్స్‌కు నిట్టనిలువునా చీలిక వచ్చిందని అన్నారు. ఏడో బ్లాక్‌లో 20వ పియర్ పూర్తిగా కుంగిపోయిందని పేర్కొన్నారు. 21 నుంచి 16వ పియర్ వరకు పారాపెట్ గోడ కుంగిపోయిందని అన్నారు. బ్యారెజ్ కట్టిన తర్వాత ఎలాంటి తనిఖీలు, మెయింటెనెన్స్ చేయలేదని అన్నారు. 2022లో వరదల కారణంగా అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లు మునిగాయని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
90 శాతం ఫెయిల్
అగ్రిమెంట్ ప్రకారం ఎల్ అండ్ టీ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. పనులు కానప్పటికీ ఏజెన్సీకి నిధులు విడుదల చేయాలని రామగుండం ENC లేఖ. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 93 వేల 872 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్లాన్ అని.. నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకోవడంలో ప్రాజెక్టు 90 శాతం ఫెయిల్ అయిందని పేర్కొన్నారు.
ఏపీకి ఎక్కువ..
కాళేశ్వరం ద్వారా 98 వేల 890 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ఎత్తిపోసిన నీళ్లన్ని సముద్రం పాలయ్యాయని అన్నారు. అంటే నీటిని ఎత్తిపోసేందుకు అయిన ఖర్చు మొత్తమంతా వృథానే అని అన్నారు. ఏపీ అధిక నీటి వినియోగాన్ని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీ 100 టీఎంసీలు అధికంగా ఉపయోగించుకుందని వెల్లడించారు.
ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!
DO WATCH: