Tummala Nageswara Rao: వాళ్ల విన్యాసాలు చూస్తే జాలేస్తుంది.. మంత్రి తుమ్మల సెటైర్!

కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వారి విన్యాసాలు, అసత్య ప్రచారాలు చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. ఎటూ పాలుపోక కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు
New Update

Telangana: రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విన్యాసాలు చూస్తే జాలేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. గత నాలుగు రోజులనుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి, తమ రాజకీయ మనుగడ కాపాడు కొనేటందుకు పాట్లు పడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు..

ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు. ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోను ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచనే చెయ్యని వారు. వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి యేడాదిలోపే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎటూ పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఇక బ్యాంక్స్ నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుతానిదేనన్నారు. ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పథకాన్ని వర్తింపచేసాం. రూ. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు రూ. 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించాలి. ఆ తర్వాత అర్హతను బట్టి చెల్లిస్తాం. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా తప్పుగా ఉందంటున్న రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నామన్నారు.

ఇక రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరుతున్నాం. గత ప్రభుత్వ నిర్వకాలు ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా రుణమాఫీ వివరాలు అందరికీ తెలియజేస్తున్నాం. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికారంలో వున్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీతో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకొని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి, ప్రజల్లో తమ స్థాయిని కాపాడు కొంటారని ఆశిస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.31000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతున్నామని చెప్పారు. ఆగస్ట్ 15 లోపు రూ. 18000 కోట్లతో రూ. 2 లక్షల లోపు రుణ మాఫీ చేసిన ప్రభుత్వంతో సవాల్ చేస్తున్నారా అంటూ సెటైర్ వేశారు.

#minister-tummala-nageswara-rao #bjp #farmer-loan-waiver #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe