Chandrababu arrested: మోసం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు

నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు.

Minister Roja: మంత్రి రోజాకు షాక్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. అసలేమైందంటే?
New Update

నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే తన లక్ష్యమని ప్రజల ముందు ప్రగాల్భాలు పలికిన చంద్రబాబు కేంద్రం వద్ద ముడుపులు తీసుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్ అంటూ వివిధ కంపెనీల నుంచి వందల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. చంద్రాబుబు పెద్ద సైకో అయితే నారా లోకేష్‌ చిన్న సైకో అంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లో లోకేష్‌ పాత్ర కూడా ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు పెద్ద కేడీ అన్న రోజా కాస్త ఆలస్యమైనా అధికారులు కేడీ మోసాలను బయటకు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలిసిపోయాయని, బాబు ప్రజల ధనాన్ని ఎలా మింగాడో ప్రజలకు అర్థమైందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఓ కమర్షియల్‌ కింగ్‌ అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014వ సంవత్సరం నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలు ముడుపులు ఇస్తేనే ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకునేలా లింక్ పెట్టారన్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రాక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు. ఇందులో నారా లోకేష్‌ పాత్ర ఉంటే తండ్రీ కొడుకులను ఓకే జైల్లో పెడతామన్నారు. మరోవైపు చంద్రబాబును జైల్లో పెట్టడంతో ఎన్టీ రామారావు ఆత్మ సంతోషిస్తుంటుందన్నారు. కాగా లోకేష్‌ మంచి వారిని జైలుకు, చెడ్డ వారిని లండన్‌కు పంపిస్తున్నారని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

#lokesh #ycp #tdp #arrest #chandrababu #minister-roja #skill-development
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe