Telangana: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం

అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్రమణల వెనుక ఎవరున్నా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

New Update
Telangana: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం

హైదరాబాద్‌లో చెరువులు, పార్కులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి సమచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. '' ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడటానికి జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం తెలిస్తే స్థానిక ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. రాష్ట్రంలో చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.

Also Read: ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్

చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే దాని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే.. సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. సమాజంలో మనం బాధ్యతగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం లాంటిది. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంతటివారైనా, ఏ పార్టీ వారైనా సరే ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం ఇది ఎవరి మీద కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు, పార్టీల మీద చేస్తున్న పోరాటం కాదు. పాలనలో మార్పు తీసుకురావడానికి తీసుకుంటున్న చర్య'' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

Also Read: తప్పు ఎవరిది? జీహెచ్‌ఎంసీ ఎందుకు అనుమతులిచ్చింది? ఆ నష్టపరిహరం ఎవరిస్తారు?

Advertisment
Advertisment
తాజా కథనాలు