బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని నిరుపించాలన్నారు. ఒకవేళ తన ఇల్లు, ఫామ్‌హౌస్ బఫర్ జోన్‌లో ఉంటే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆదేశించారు. ప్రెస్‌మీట్ నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. తానెక్కడ నిబంధలను ఉల్లంఘించలేదని పొంగులేటి స్పష్టం చేశారు.
Also Read: ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు.. అభయ తల్లిదండ్రుల సంచలన ఇంటర్వ్యూ
తాను చెరువు కబ్జా చేసి ఇల్లు, ఫామ్ హౌస్ కట్టానని.. సోషల్ మీడీయాలో ఫొటోలు పెట్టి బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా రెండ్రోజుల క్రితమే ఈ విషయంలో పొంగులేటిపై కేటీఆర్ కూడా విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా).. హైదరాబాద్‌లోని చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.