/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Srinivas-Reddy-jpg.webp)
Minister Ponguleti: ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో మళ్లీ సొంత గూటికి చేరుతారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం భద్రచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కేటీఆర్, బీఆర్ఎస్ (BRS) నేతలను కలవడం చర్చనీయాంశమైంది. కాగా ఆయన కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy). తెల్లం వెంకట్రావు ఎక్కడికి పోడు అని స్పష్టం చేశారు. పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను కలిసి ఉంటాడని అన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ఎవరికీ ఇబ్బంది కలగదని చెప్పారు. తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉంటాయని.. ఎవరూ ఎక్కడికి పోరని స్పష్టత ఇచ్చారు.
నిన్న సొంత గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఊహించని షాక్ తగిలింది. గద్వాల్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్లారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా కృష్ణ మోహన్ రెడ్డి చేరికతో గద్వాల్ కాంగ్రెస్ లో చీలికలు మొదలయ్యాయి. ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. దీంతోనే ఆయన తిరిగి సొంత గులాబీ గూటికి చేరినట్లు సమాచారం.