Andhra Pradesh : గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది : పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. By B Aravind 23 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pemmasani Sensational Comments On YSRCP : గుంటూరు (Guntur) లో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) విమర్శలు చేశారు. తాజాగా ఆయన కలెక్టరేట్‌లో కార్పొరేషన్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ (Public Health) అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ' నగర పాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేశాం. నిధులు లేకపోవడంతో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు (Drainage Works) ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం వీటి నిధులు దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసింది. Also Read: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పలు పథకాలకు ఆమోదం! నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. నీధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాం. అర్ధాంతరంగా నిలిచిన పనులను అధికారుల సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రతివారం లేకుంటే రెండు వారాలకొకసారి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని' పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Also Read: హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! #telugu-news #guntur #ap-politics #ysrcp #pemmasani-chandra-sekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి