Minister Komati reddy Venkata Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటలయుద్ధం సాగింది. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో హాఫ్ నాలెడ్జ్ అంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... హరీశ్ రావు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీఆర్ఎస్ అంటేనే అబద్ధాలకు పుట్టిల్లు అన్నారు. బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ సభకే రాలేదన్నారు.సభలో సమాధానం చెప్పలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ఆయన స్థానంలో హరీశ్ రావును పంపించారన్నారు. హరీశ్ రావు ఓ డమ్మీ నాయకుడు అన్నారు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందన్నారు.
24 గంటలు కరెంట్ ఇచ్చామని హరీశ్ రావు చెప్పారని, కానీ అందులో నిజం లేదన్నారు. హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్య మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు రికార్డ్స్ నుంచి తొలగించుకోండని హరీశ్ రావు సభాపతికి సూచించారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని కోమటిరెడ్డి గతంలో అనలేదా? అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బస్సులను పెంచాలని సూచించారు.
Also Read:AP Govt Schemes: ఏపీలో మరో ఆరు పథకాల పేర్లు మార్పు.. లిస్ట్ ఇదే!