Telangana : కేసీఆర్‌ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

కేసీఆర్ కుటుంబానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వాళ్ల అక్రమ ఆస్తులను బయటకు తీసి పేదలకు పంచుతామన్నారు. కవితకు బుర్జ్ ఖలీఫాలో రూ.150 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఉందంటూ ధ్వజమెత్తారు.

New Update
TG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Komatireddy : తెలంగాణ(Telangana) అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంట పొలాలకు నీళ్లు, రైతుల సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) కాంగ్రెస్‌ సర్కార్‌(Congress Sarkar) పై తీవ్రంగా విమర్శలు చేస్తుండగా.. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(Komatireddy Venkat Reddy) కేసీఆర్‌ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారు.

Also Read: నాపై కామెంట్లు చేస్తున్న వారు ఇది చదవండి: కంగనా

వాళ్ల అక్రమ ఆస్తుల, వివరాలను బయటకు తీసి పేదలకు పంచుతానని ప్రకటన చేశారు. అలాగే ఎమ్మెల్సీ కవితకు దుబాయ్‌లో బుర్జు ఖలీఫాలో దాదాపు రూ.150 కోట్లు విలువచేసే ఫ్లాటు ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ కుటుంబానికి ఫాంహౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయం అవుతున్నాయి.

Also Read: భార్య పదేపదే అలా చేయడం తప్పే!

Advertisment
తాజా కథనాలు