Minister Komati reddy: ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల (మోర్త్) శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ను కోరారు. ఈ మేరకు ఆయన అనురాగ్ జైన్ తో సమావేశమయ్యారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అభ్యర్థించారు. మంత్రితో పాటు సమావేశంలో పాల్గొన్న ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా సమావేశం సాగింది. రహదారుల నిర్మాణాలపై సెక్రెటరీతో కులంకుషంగా మంత్రి చర్చించారు. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్ సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చారు.
Also Read:Ambani’s Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు