Ambani's Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు 5 వేల కోట్లు పెట్టి పెళ్ళి చేస్తే అంతకన్నా ఎక్కువ విలువైన గిఫ్ట్‌లు వచ్చాయి. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి దేశ, విదేశాల నుంచి అతిథులు వచ్చారు. వారిలో ఎవరు కొత్త జంటకు విలువైన బహుమతులను ఇచ్చారో తెలుసా.. By Manogna alamuru 23 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Annath- Radhika Wedding: కొన్ని రోజులుగా భారతదేశం అంతా అనంత్-రాధికాల పెళ్ళి గురించే మాట్లాడుకున్నారు. రోజుకో వార్తతో మీడియా అంతా హోరెత్తిపోయింది. పెళ్ళయి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా దాని గురించే బోలెు వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఈరోజు బాగా హైలెట్ అయిన విషయం...అనంత్-రాధికాలకు వచ్చిన గిఫ్ట్స్. అత్యంత విలువైన బహుమతులిచ్చిన టెక్ దిగ్గజాలు.. అనంత్ అంబానీ తన పెళ్ళికి వచ్చిన సెలబ్రిటీలకు ఖరీదైన వాచ్‌లు బహుమతిగా ఇచ్చాడు. రెండు కోట్ల ఖరీదైన వాచ్‌లు తనకు బాగా దగ్గరై వారికి ఇచ్చుకున్నాడు. అయితే అనంత్ అంబానీ-రాధికాలకు అంతకంటే విలువైన బహుమతులు కానుకగా వచ్చాయిట. అందులో అన్నికంటే మార్క్ జుకర్ బర్గ్ ఇచ్చిన గిఫ్టే హైలెట్ అని చెబుతున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అనంత్- రాధిక మర్చంట్ జంటకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ని బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. ఇక.. ఈ కొత్త జంటకు ముకేష్-నీతాలు కూడా ఖరీదైన బహుమతిలు ఇచ్చారట. పామ్ జుమేరాలో దాదాపు 3వేల చదరపు అడుగుల ఇంటిని బహుమతిగా ఇచ్చారట. దీని విలవ దాదాపు రూ.60కోట్లు కావడం గమనార్హం. దీనికి తోడు రూ.130కోట్ల విలువచేసే నగలు, రూ.5.42 కోట్ల విలువ చేసే బెంట్లీ కారును కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక వ్యాపారవేత్త బిల్ గేట్స్ రూ.9 కోట్ల విలువైన వజ్రాన్నిఈ జంటకు బహుమతిగా ఇచ్చారు. రస్ట్లర్ జాన్ సెనా రూ.3 కోట్ల విలువైన లాంబోర్గినీ కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రూ.11.50 కోట్ల విలువైన బుగాటీ కారును బహుమతిగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. తగ్గేదేల్యా అన్న బాలీవుడ్ సెలబ్రిటీలు మరోవైపు పెళ్ళికి వచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అనంత్‌కు భారీగా గిఫ్ట్‌లు చదివించుకున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పారిస్‌లో రూ.40 కోట్ల ఇంటిని బహుమతిగా ఇస్తే.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 30 కోట్ల రూపాయల విలువైన నెక్‌పీస్‌ను బహుమతిగా ఇచ్చారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె 20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 15 కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిని.. రణబీర్ కపూర్, అలియా భట్ లు రూ.9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును, నటుడు అక్షయ్ కుమార్ రూ.60 లక్షల విలువైన బంగారు పెన్నును బహుమతిగా ప్రెజెంట్ చేశారు. వీరి తర్వాత విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 19 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును.. సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌మేడ్ శాలువను బహుమతిగా ఇచ్చారు. Also Read:Telangana: స్మిత సబర్వాల్ పై NHRCకి ఫిర్యాదు #ananth-ambani #wedding #radhika #gifts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి