Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు

ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని పేర్కొన్నారు.

New Update
Harish Rao: ఆటో డ్రైవర్లకు అలా చేసి ఆదుకోండి.. కాంగ్రెస్‌కు హరీష్‌ రావు డిమాండ్‌..

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తలచుకుంటే రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలులో పెట్టేవారని అన్నారు. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదని వ్యాఖ్యానించారు. ‘‘ పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా?. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు. ఇక్కడ అలా లేదు అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్ గెలిచే విధంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నామని.. ఎన్ని ట్రిక్​లు చేసినా కూడా బీఆర్​ఎస్ హ్యాట్రిక్​ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read: దసరా పండుగ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకీ కాసుల వర్షం..

రాష్ట్రానికి కేసీఆర్ శుభసూచకం
విజయదశమికి పాలపిట్ట ఎంత శుభసూచకమో.. రాష్ట్రానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం అంతే శుభ సూచకమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ లభించని మాణిక్యం అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగటంతో.. ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి రాగానే గుర్తింపు కలిగిన నామినేటెడ్‌ పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు అనుచరులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై కూడా హరీష్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కిషన్‌ రెడ్డి తన పదవికి రాజీనామా కూడా చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఆయనకు అధికారం కట్టబెడితే ఎంత మేరకు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. రేవంత్ పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తి అంటూ రేవంత్‌పై విమర్శలు చేశారు. ఓటుకు నోటు - నోటుకు సీటు అనే వ్యక్తులను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు