Telangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్..

పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఆయన కామెంట్స్‌ను ఉదహరిస్తూ రివర్స్ సెటైర్లు వేవారు. 'మోదీ వచ్చింది ఏమతది.. ఏం కాదు.. ఏం చేసినా రాష్ట్రంలో బీజేపీ లేవదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

New Update
Telangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్..

Minister Harish Rao: పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు(Minister Harish Rao). ఆయన కామెంట్స్‌ను ఉదహరిస్తూ రివర్స్ సెటైర్లు వేవారు. 'మోదీ వచ్చింది ఏమతది.. ఏం కాదు.. ఏం చేసినా రాష్ట్రంలో బీజేపీ లేవదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీవి అన్నీ చిలుక పలుకులు, ఉత్త ముచ్చట్లేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 5 ఏళ్ల సమయం ఇస్తే ఏం చేస్తారని సూటిగా, సుత్తి లేకుండా ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ 9 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? అంటూ నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కృష్ణా జలలా పంపిణీకి ట్రిబ్యునల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల్లో కేటాయింపులు ఎందుకు చేయడం లేదన్నారు.

బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతోందని ఆరోపించారు మంత్రి. గిరిజన యూనివర్సిటీని మీరు కొత్తగా ఇచ్చేదేంటని ప్రశ్నించారు హరీష్ రావు. విభజన చట్టంలో 9 ఏళ్ల క్రితమే పెట్టారని, పార్లమెంట్ ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా అడ్డుపడింది బీజేపీ ప్రభుత్వం అని ఆరోపించారు. 9 ఏళ్లుగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా డ్రామాలాడింది బీజేపీ సర్కార్ అని విమర్శించారు. ఇప్పుడు వచ్చి గిరిజన యూనివర్సిటీ అంటూ చెవుల్లో పువ్వులు పెడుతున్నారంటూ ప్రధాని మోదీ తీరును విమర్శించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలను బీజేపీ ఇంకా మోసం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు.

Also Read:

Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..

YS Jagan: అంతా రెడీ.. విజయదశమికి ఛలో విశాఖ.. ఈ నెల 23న సీఎం జగన్ గృహ ప్రవేశం

Advertisment
తాజా కథనాలు