Minister Gummanuru Resigned To YCP : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తమకు టికెట్ రానివాళ్ళందరూ జంపింగ్ జపాన్లు అవుతున్నారు. తాజాగా వైసీపీ(YCP) లో టికెట్ దక్కలేదని మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanuru Jayaram) పార్టీకి రాజీనామా చేశారు. రేపో, ఎల్లుండో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఇక గుమ్మనూరు ఈరోజు జయహో బీసీ సబలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు కూడా. ఇప్పటికే మంత్రి చంద్రబాబు(Chandrababu) తో సమావేశంఅయ్యారు. దీని కోసం ఆయన ఆలూరు నుంచి భారీ వాహనాలతో భారీ ర్యాలీ గా వెళ్ళారు. టీడీపీలో చేరాక వచ్చే ఎన్నికల్లో గుమ్మనూరు ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపీగా పోటీ చేయలేను..
వైసీపీకి రాజీనామా చేశాక మంత్రి గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడారు. 12 సంవత్సరాలుగా వైసీపీ జెండా మోసాను.. నా కష్టానికి తగిన విధంగా ఎమ్మెల్యే గా, మంత్రిగా పని చేశాను. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఎక్కడో చిన్న పల్లెటూరు లో పుట్టి పెరిగిన నేను..నా ప్రాంత ప్రజలకు ఎదోక మంచి చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. నా శక్తి మేరకు పని చేశాను. కానీ ఇప్పుడు పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పింది. అది నాకు ఇష్టం లేదు. నా కార్యకర్తలు, అభిమానులు కూడా నేను ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని గుమ్మనూరు చెప్పుకొచ్చారు. అందుకే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. దీని తర్వాత జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని ప్రకటించారు గుమ్మనూరు.
గుంతకల్ నుంచి పోటీ..
టీడీపీ అధిష్టానం నాకు గుంతకల్ సీట్ ఇస్తానని హామీ ఇచ్చిందని చెబుతున్నారు గుమ్మనూరు జయరాం. స్థానికంగా నా ప్రజలు కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. వైసీపీ లో బిసీలకు న్యాయం జరగలేదు. నా బిసీలు అంటూ ముఖ్యమంత్రి పదే పదే చేప్పినా.. వాస్తవంగా అలాంటి పరిస్థితులు లేవని విమర్వించారు గుమ్మనూరు. కర్నూల్, అనంతపురంలో బోయ,వాల్మీకి లకు జగన్ మొండిచెయ్యి చూపించారు. గతంలో జగన్ ను జీసస్ గా, అల్లా గా పొగిడాను కానీ ఆయన ఇప్పుడు శిలలాగా మారిపోయాడని అన్నారు. జగన్ కు దనుంజయ్ రెడ్డి, సజ్జల ఇద్దరు పూజరాలు..వాళ్ళు చెప్పిన వారికి పదవులు, వారసులులకు మాత్రమే సీట్లు ఇస్తారని గుమ్మనూరు ఆరోపించారు. అందుకే పూజారులు వర్గానికి చెందిన వారికే సీట్లు ఇచ్చారని అన్నారు.
Also Read : National : దేశంలో 17చోట్ల ఎన్‌ఐఏ సోదాలు