Botsa Satyanarayana Counter to Prashant Kishor: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రమంతటా రాజకీయ వేడి నెలకొంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లపై విమర్శలు చేశారు. చంద్రబాబు (Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలను మేనేజ్ చేసేవాడని.. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకబడ్డాయని అన్నారు. జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సీఎం జగన్ (CM Jagan) అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.
Also Read: జనసేనకు పోతిన మహేష్ గుడ్‌బై
ప్రశాంత్ కిషోర్‌పై విమర్శలు
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారని మంత్రి బొత్స అన్నారు. ప్రశాంత్ కిషోర్‌ని బిహార్ నుంచి తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చి ఇష్టమచ్చినట్లు మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఐదేళ్లపాటు తమ దగ్గర కూడా పనిచేశారని.. ఆయన ఆలోచనలు తీసుకొని ఉంటే.. తాము మునిగిపోయే వాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి అవకాశం ఇవ్వలేదని.. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. మా నాయకుల దగ్గర ప్రశాంత్ డబ్బులు కూడా తీసుకున్నాడని.. ఇక్కడ మేనేజ్‌మెంట్ తప్ప అతను చేసింది ఏమీ లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీడీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఏపీలో ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read: మరోసారి పవన్‌కల్యాణ్‌కి అస్వస్థత