Khammam : కాంగ్రెస్ అధిష్టానంపై అలిగిన భట్టి, తుమ్మల

TG: ఖమ్మం ఎంపీ సీటు నేపథ్యంలో ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి మధ్య సయోధ్య దెబ్బతిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టాన్ని కలగజేసుకుని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టి చర్చలు జరిపితేనే మనస్పర్థలు తొలగుతాయనే చర్చ జరుగుతోంది.

New Update
Khammam : కాంగ్రెస్ అధిష్టానంపై అలిగిన భట్టి, తుమ్మల

Khammam Politics : ఖమ్మం లోక్‌సభ(Lok Sabha) కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి ని అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ఇందుకోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వర్గీయులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా హాజరవుతారని.. పొంగులేటి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. కానీ భట్టి హాజరు కాలేదు. మరోవైపు పొంగులేటి, రేణుక ఒక్కటయ్యారంటూ కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఖమ్మం లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి ఆచితూచి పావులు కదుపుతున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు చేసేందుకు ఆయన యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుమ్మల, భట్టి తమ వారికి టికెట్‌ దక్కలేదని లోలోపల అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

దీంతో ఖమ్మంలో కాంగ్రెస్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. దీనంతటికీ కారణం ఏఐసీసీ(AICC) కాలయాపనే అని చర్చ జరుగుతోంది. ఖమ్మం సీటు నేపథ్యంలో ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్య దెబ్బతిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టాన్ని కలగజేసుకుని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టి చర్చలు జరిపితేనే మనస్పర్థలు తొలగుతాయనే చర్చ జరుగుతోంది.

Also Read : బిడ్డా గన్‌ పార్క్‌ కి రా..నువ్వో..నేనో తేల్చుకుందాం!

Advertisment
తాజా కథనాలు