Minister Amarnath:మంత్రి అమర్నాథ్ పోటీపై వీడుతున్న ఉత్కంఠ.. వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మీద ఉత్కంఠతకు తెరపడేటట్లు కనిపిస్తోంది. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్థానంలో అమర్‌నాథ్‌ను పోటీ చేయమని అదిష్టానం అడిగిందని..దానికి ఆయన కూడా పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. By Manogna alamuru 08 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Pendurthi:మంత్రి అమర్‌నాథ్ బాధ ఎట్టకేలకు తీరినట్టే కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి ఆయనను ఇంఛార్జ్‌గా తీసేసిన తర్వాత ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే ఇప్పుడు అమర్‌నాథ్‌కు వైసీపీ అధిష్టానం పెందుర్తి సీటు కేటాయించిందని...దానికి ఆయన కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. జనసేన,టీడీపీల మీద బలమైన అభ్యర్థిగా అమర్నాథ్ అవుతారని వైసీపీ భావిస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గం నుంచి అమర్నాథ్ రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పెందుర్తి పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. ప్రస్తుత పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజు స్థానంలో అమర్‌నాథ్ పోటీ చేయనున్నారు. దీని మీద ఇవాళ రేపో వెలువడనున్న ప్రకటన వెలువడుతుందని సమాచారం. దీంతో పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న మూడోతరం నేతగా అమర్నాథ్ నిలుస్తున్నారు. అమర్నాథ్ ఫ్యామిలీతో పెందుర్తి నియోజకవర్గానికి అనుబంధం ఉందని...ఇది ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు. Also read:బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనకాపల్లిని వదిలి వెళుతూ కంటతడి... అంతకుముందు అనకాపల్లిని వదిలిపెట్టి వెళుతున్నప్పుడు మంత్రి అమర్నాథ్ కంటతడి పెట్టుకున్నారు. అనకాపల్లిని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇన్ని రోజులూ అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. మిమ్మల్ని వీడి వెళ్లడం బాధగా ఉందని.. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని ఆయన అన్నారు. అనకాపల్లిలో కొత్త నియోజకవర్గ ఇంఛార్జి మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో.. మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన పని అయిపోలేదు.. ఇక కొన్ని పత్రికలు, ఛానళ్ళు రాస్తున్నట్టు తన పని అయిపోలేదని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నానని.. చిన్న వయసు నుంచే బాధలు పడ్డానని ఆయన తెలిపారు. ఇలాంటి వార్తలు వల్ల తానేమీ కుంగిపోనని పేర్కొన్నారు. వైసీపీలో అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది...అదే వైపీసీ కార్యకర్త పోస్టు. అది ఉంటే చాలని ఇంకేమీ అవసరం లేదన్నారు. తాను పార్టీ కార్యకర్తగా జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని.. వీధుల్లో కార్యకర్తగా తిరగుతానని అమర్‌నాథ్ అన్నారు. #andhra-pradesh #ycp #politics #minister-amarnath #pendurthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి