Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్
దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు.