Crime:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొడుకు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్ పై కేసు నమోదు అయింది. బిల్డర్ను బెదిరించి అక్రమంగా 12 లక్షలు వసూలు చేసినట్లు ఇతను ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

Crime:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు  డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్
New Update

MIM ఎమ్మెల్యే కుమారుడు ఇంతియాజ్ ఖాన్ , MIM స్థానిక నాయకుడు గులాం ఖాదర్ జీలానీ అలియాస్ మన్నన్ లను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. వీరిద్దరూ 2021లో ఓ బిల్డర్ దగ్గర నుంచి బలవంతంగా 12లక్షలు మామూలు వసూలు చేశారని తెలుస్తోంది. అందులో
మన్నన్ 5 లక్షలు, ఎమ్మెల్యే కొడుకు ఇంతియాజ్ 7 లక్షలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు లీక్ అవ్వడంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో వుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్డర్ ముఖీద్ చౌదరి నుంచి ఇద్దరూ 12 లక్షల మమూలు వసూలు చేశారు. స్థానిక నాయకుడైన మన్నన్ బిల్డర్ ను బెదిరించి అతని వద్ద 12 లక్షలు వసూలు చేసి ఎమ్మెల్యే కొడుకుకు మాత్రం 8 లక్షలే వచ్చాయని అబద్ధం చెప్పాడు. ఎమ్మెల్యే కొడుకు ఇంతియాజ్ కు ఏడు లక్షలు ఇచ్చి లక్ష తాను తీసుకున్నానని చెప్పాడు.

Also Read:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి

ఇది జరిగిన నెల తర్వాత అసలు విషయం ఎమ్మెల్యే కొడుకు అయిన డాక్టర్ ఇంతియాజ్ కు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన డాక్టర్ ఇంతియాజ్ నాయకుడైన మన్నన్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. అర్ధగంట లో తీసుకున్న ఐదు లక్షలు తన క్లినిక్ కు వచ్చి ఇవ్వకపోతే నిన్ను నీ తమ్ముడిని ఎత్తుకొచ్చి తంతానని... బూతులతో రెచ్చిపోయాడు. ఐదు లక్షలు తీసుకున్న దాంట్లో నేనొక్కడినే లేను మీ స్నేహితుడు అహ్మద్ కూడా ఉన్నాడు. మీ దగ్గర నుంచి నేనేం డబ్బులు తీసుకోలేదు. నేనే మీకు డబ్బులు ఇచ్చాను అని మన్నన్ ఎమ్మెల్యే కుమారుడైన డాక్టర్ ఇంతియాజ్ కు ఫోన్ లో చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఇంతియాజ్.. ఆ బిల్డర్ కట్టిన బిల్డింగ్ను ghmc అధికారులతో కూలగొట్టిస్తా... రోడ్ వైడ్‌నింగ్‌లో కూలిపోతుంది.. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని నీ మీద కేసు కూడా పెడతా అంటూ మన్నన్ కు వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం ఈ సంభాషణ అంతా మన్నన్ కాల్ రికార్డ్ చేశారు. ఈ ఆడియోనే ఇప్పుడు లీక్ అయింది.

ఆడియె రికార్డ్ ఆధారంగా బిల్డర్ ముఖీద్ చౌదరి, నిందితులు ఎమ్మెల్యే కొడుకు ఇంత్యాజ్, మన్నన్ లను పోలీసులు విచారించారు. నిందితులు అక్రమంగా బిల్డర్ ను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ధృవీకరించారు. బాధితుడైన బిల్డర్ ముఖీద్ చౌదరి మాత్రం నిందితుల పై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో చార్మినార్ పోలీసులే సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు.

#arrest #mla #mim #son #hyderababd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe