NEET Paper Leak: ముగిసిన నీట్ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన వారందరూ ఒక నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని చీఫ్ జస్టీస్ ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. By B Aravind 08 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. మరికొందరు మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీకోర్టులో (Supreme Court) దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ (D.Y. Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. 'నీటి పరీక్షకు 24 గంటల ముందు క్వశ్చన్ పేపర్ వాట్సాప్, టెలిగ్రామ్‌లో లీక్ అయ్యిందనేది వాస్తవం. సోషల్ మీడియాలో లీకవ్వడం వల్ల అది విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు వ్యాప్తి చెందింది అనేదానిపై క్లారిటీ లేదు. Also Read: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్ నీట్, జేఈఈలలో సీటు సంపాదించాలనేది ప్రతి విద్యార్థి కల. రీ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించే ముందు పేపర్ లీక్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు. రీ టెస్ట్ అనేది చివరి ఆప్షన్. నీట్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన వారందరూ ఒక నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలి. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీకి పలు ప్రశ్నలపై క్లారిటీ ఇవ్వాలి. పేపర్ లీక్ ఎప్పుడు, ఏ విధంగా జరిగింది.. పేపర్ లీకేజీకి పరీక్ష నిర్వహించడానికి మధ్య ఎంత సమయం ఉంది అనేది గుర్తించాల్సి అవసరం ఉంది. పేపర్ లీక్ కొన్ని సెంటర్లకే పరిమితమై తప్పు చేసిన వారిని గుర్తించడం సాధ్యమైతే అప్పుడు రీ టెస్ట్ నిర్వహించాలని కోరడం సరైంది కాదని' చీఫ్ జస్టీస్ అన్నారు. ఈ మేరకు నీట్ -యూజీ విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇదిలాఉండగా నీట్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో 38 పిటిషన్లు దాఖలయ్యాయి. మే 5 న నీట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది ఈ పరీక్షను రాశారు. ఇక జూన్ 4 న ఫలితాలు వెల్లడించారు. ఈసారి ఎక్కువ మందికి ఫుల్ మార్క్స్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. చివరికీ పేపర్ లీకైన విషయం బయటపడింది. Also Read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ #telugu-news #supreme-court #neet #neet-paper-leak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి