Meta: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్.. మెటా సంస్థ.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.ఈ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది. By B Aravind 20 Apr 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) రాకతో.. రోజురోజుకు కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. అయితే ఈ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది. అలాగే వాట్సాప్‌లో రియల్‌టైమ్ ఇమేజన్‌లను, యానిమేషన్లను కూడా రూపొందించి ఇవ్వగలదు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యూజర్లందరికీ అందుబాటులో రానుంది. Also Read: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు.. ఈ ఏఐ ఫీచర్‌ను మరిన్నీ దేశాలకు విస్తరిస్తున్నట్లు మెటా పేర్కొంది. మనదేశంలో కూడా కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ చాట్ మెనూలో వివిధ రంగులతో వృత్తాకారంలో మెటా ఏఐ సింబల్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే.. ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అంటూ ఓ పాప్‌అప్ ఓపెన్ అవతుంది. కంటిన్యూపై క్లిక్ చేస్తే.. మెటా ఏఐతో చాట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో అడిగే ప్రశ్నలన్నింటికీ ఏఐ సమాధానమిస్తుంది. అంతేకాదు వాట్సాప్ వీడియో స్టేషన్ అప్‌డేట్స్, వాట్సాప్ పేమెంట్స్ విషయంలో మెటా సంస్థ పలు మార్పులు చేసింది. ప్రస్తుతం 30 సెకండ్ల వీడియో వరకే స్టేటస్ లిమిట్ ఉంది. అయితే దీన్ని ఒక నిమిషానికి పెంచేలా మెటా కసరత్తులు చేస్తోంది. ఇక పేమెంట్స్‌ను కూడా మరింత సులభతరంగా చేసేలా.. చాట్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించేలా పలు మార్పులు చేసింది. Also read: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్ షా ఆస్తుల వివరాలు #telugu-news #whatsapp #meta #facebook మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి