Breast Cancer : రొమ్ము క్యాన్సర్(Breast Cancer) అనేది మహిళలకు(Women’s) మాత్రమే వచ్చే వ్యాధి అని అందరూ అనుకుంటుంటారు. అయితే పురుషులకు(Men’s) కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి భయం అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని, కాకపోతే మహిళలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇద్దరిలో రొమ్ము కణజాలం ఉంటుందని, కాకపోతే పురుషుల్లో తక్కువగా ఉంటుందని, అది క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెయ్యి మంది మగవారిలో ఒకరు మాత్రం రొమ్ము క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే కణజాలాన్ని జీవితకాలం కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో మాత్రం 8 మందిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. పురుషులలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి వృద్ధాప్యం, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు హార్మోన్ థెరపీ లేదా ఈస్ట్రోజెన్ కలిగిన మందులు, ఊబకాయం కారణమవుతాయని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్..లక్షణాలు ఇవే..!!
పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం, రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు, ముడతలు, వాపు వంటి మార్పులు ఉంటే పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లే అని వైద్యులు చెబుతున్నారు.
Translate this News: