Health Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌..లక్షణాలు ఇవే..!!

పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుందని నిపుణులు అంటున్నారు. నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం, రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు, ముడతలు, వాపు వంటి మార్పులు ఉంటే పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లే అని వైద్యులు చెబుతున్నారు.

New Update
Health Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌..లక్షణాలు ఇవే..!!

Breast Cancer : రొమ్ము క్యాన్సర్(Breast Cancer) అనేది మహిళలకు(Women's) మాత్రమే వచ్చే వ్యాధి అని అందరూ అనుకుంటుంటారు. అయితే పురుషులకు(Men's) కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుందని నిపుణులు అంటున్నారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి భయం అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని, కాకపోతే మహిళలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇద్దరిలో రొమ్ము కణజాలం ఉంటుందని, కాకపోతే పురుషుల్లో తక్కువగా ఉంటుందని, అది క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెయ్యి మంది మగవారిలో ఒకరు మాత్రం రొమ్ము క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే కణజాలాన్ని జీవితకాలం కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో మాత్రం 8 మందిలో ఒకరిలో ఈ సమస్య ఉంటుంది. పురుషులలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి వృద్ధాప్యం, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు హార్మోన్ థెరపీ లేదా ఈస్ట్రోజెన్ కలిగిన మందులు, ఊబకాయం కారణమవుతాయని అంటున్నారు.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

  • పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు స్త్రీలలోలానే ఉంటాయి. మామూలుగా కనిపించే లక్షణం నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం. రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు, ముడతలు లేదా వాపు వంటి మార్పులు వస్తాయి. అలాగే చనుమొన లోపలికి పోయి ఉంటే అది రొమ్ము క్యాన్సర్‌కు సూచిక కావచ్చు. రొమ్ము క్యాన్సర్‌ వల్ల ఎలాంటి నొప్పి లేకపోయినా కొందరు పురుషులకు రొమ్ము ప్రాంతంలో అసౌకర్యం కలుగుతుంది.

Also Read : పరీక్షల కాలం..ఈ టిప్స్ తో ఒత్తిడికి టాటా చెప్పేయండి..!!

పురుషులు, స్త్రీల లక్షణాలలో తేడాలు:

  • లక్షణాలు చాలావరకు ఒకే విధంగా ఉన్నప్పటికీ, స్త్రీలతో పోలిస్తే పురుషులలో రొమ్ము క్యాన్సర్(Breast Cancer For Men's) విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. పురుషులకు వారి రొమ్ము కణజాలంలో మార్పుల గురించి అంతగా తెలియదు. అరుదుగా రావడం వల్ల సరైన అవగాహన ఉండటం లేదు.

రోగ నిర్ధారణ-చికిత్స:

  • మగ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో శారీరక పరీక్ష, ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీ ఉంటాయి. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అలాగే మగవారికైతే హార్మోన్ థెరపీని కూడా వైద్యులు సిఫార్సు చేస్తారు.

ఇది కూడా చదవండి: మెనోపాజ్‌ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు