Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా ?.. ఈ టిప్స్ పాటిస్తే చాలు

చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎగ్స్‌, పాలు, న‌ట్స్‌, చేప‌లు, చెర్రీస్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.

New Update
Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా ?.. ఈ టిప్స్ పాటిస్తే చాలు

మనిషి నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన నిద్ర ఎంతో ముఖ్యం. కంటినిండా నిద్రలేకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. హర్మోన్లతో పాటు చాలా అంశాలు కూడా నిద్రను ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పటికే చాలామంది నిద్రలేమితో బాధపడేవారు ఉన్నారు. ఇలాంటివారు మెలటోనిన్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటారు. అయితే ఈ సప్లిమెంట్స్ సురక్షితమే అయినప్పటికీ.. కొంతమందిలో తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, మగత వంటి సైడ్‌ ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి.

Also Read: మట్టి కుండలో నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా..!

నిద్రలేమితో బాధపడేవారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్‌ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. దీనివల్ల సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నిద్రలేమిని దూరం చేసుకునేందుకు ప్రతిరోజూ కూడా తినే ఆహారంలో గుడ్లు(EGGS)ని భాగం చేసుకోవడం మంచిది. ఎగ్స్‌లో ప్రొటిన్‌తో పాటు ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఇందులో మెలటోనిన్ కూడా ఎక్కువగా ఉండటతో ఇది నిద్రలేమికి చెక్ పెడుతుంది.

ప్రతిరోజూ గుడ్లతో పాటు పాలు కూడా తీసుకోవాలి. పాలలో క్యాల్షియంతో సహా.. మెటలోనిన్ కూడా ఉండటం వల్ల ఇన్‌సోమ్నియాను ఇది నివారిస్తుంది. కంటినిండా నిద్రపోయేందుకు ఎగ్స్‌, పాలు, న‌ట్స్‌, చేప‌లు, చెర్రీస్ తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రోజురోజుకి పెరుగుతున్న వేడి నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు