Chiranjeevi: ఎలా స్పందించాలో తెలియడం లేదు..పద్మవిభూషణ్‌పై చిరంజీవి కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ విభూషణ్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దేశంలో అత్యున్నత రెండవ పురస్కారం తనకు రావడం మాట్లలో చెప్పలేనంత ఆనందంగా ఉందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదని ఉద్విగ్నం అయ్యారు. By Manogna alamuru 26 Jan 2024 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Megastar Chiranjeevi: దేశ అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan Award) రావడం మీద చిరంజీవి స్పందించారు. ఆ వార్త తెఇసిన క్షణం నన్ను నేని మర్చిపోయానని అన్నారు. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థిలో ఉండిపోయానని అంటున్నారు. నన్ను ఆదరించిన తెలుగు ప్రజలకు శతకోటి అభివందనాలు అంటూ తెలిపారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను మీ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు...నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. నాకు దక్కిన ఈ గౌరవం...నన్ను ఆదరించిన ప్రతీ ఒక్కరిది అంటూ నిగర్వంగా మాట్లాడారు. Also Read:పద్మ విభూషణులు వెంకయ్య, చిరంజీవి.. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. పద్మవిభూషణ్ వచ్చిన ఆనందంలో తన మనోభావాలను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు చిరంజీవి. తనేమనుకుంటున్నారో ఒక వీడియోను పెట్టారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నా 45ఏళ్ళ సినీ ప్రస్థానంలో వెండితేర మీద ఎన్నో పాత్రలను వేస్తూ, మీకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాను. నా నిజనీవితంలో నా చుట్టూ ఉన్నవాళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తున్నాను. కానీ మీరు నా పై చూస్తున్న కొండంత అభిమానానికి నేను చేసింది గోరంతే. ఈ నిజం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి అవార్డులు నన్ను మరింత బాధ్యతగా ముందుకు నడిపిస్తాయి. నన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి (PM Modi) నా మృదయ పూర్వక కృతజ్ఞతలు అని చిరంజీవి (Chiranjeevi) చెప్పుకొచ్చారు. 🙏🙏🙏 pic.twitter.com/4PDaCV2kzv — Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024 #chiranjeevi #megastar-chiranjeevi #padma-vibhushan-award #padma-vibhushan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి