Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?

భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.

Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?
New Update

Chiranjeevi Upcoming Movies : మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇండస్ట్రీ కొంత కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత. 'ఖైదీ NO.150' మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించి మెగాస్టార్ మంచి సక్సెస్ ను అందించింది.

దాని తర్వాత అన్న, చెల్లెలి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన 'భోళా శంకర్' సినిమా మెగాస్టార్ కు నిరాశను మిగిల్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి చెందారు. బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

భోళా శంకర్ (Bhola Shankar) సినిమా డిజాస్టర్ కావడంతో చిరు నెక్స్ట్ తను తీయబోయే సినిమాలపై చాలా శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే చిరు ఖాతాలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలను  టాలీవుడ్  టాప్ డైరెక్టర్స్ దర్శకత్వంలో రానున్నాయి.

యాక్షన్ సెక్వెన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఈయనకు ఎవరూ సాటిరారు. అలాగే సినిమాల్లో తన మాటలు, డైలాగ్స్ వింటే చాలు థియేటర్స్ లో విజిల్సే.. అలాంటి టాప్  డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) తో కూడా ఒక సినిమా లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలే కాకుండా రీసెంట్ గా హీరో వెంకటేష్ కు ' F3' సినిమాతో మంచి సక్సెస్ అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో(Anil Ravipudi) మరో సినిమా లైన్లో ఉంది. తన సినిమాల్లోని కామెడీ యాంగిల్ తో ప్రేక్షకులను మెప్పించే ఈ డైరెక్టర్, మెగాస్టార్ తో చేయబోయే  సినిమా ఏ కథనంతో తెరకెక్కనుందని ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఇప్పటికే 'భోళా శంకర్', గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో నిరాశ చెందిన మెగాస్టార్ ప్రస్తుతం తను చేయబోయే సినిమాల పై మరింత ఫోకస్ పెట్టారు. ఇంతకముందు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాలకు సంబందించిన స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు  త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read: Allu Arjun: ఆ స్టార్ హీరోల తర్వాత.. ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం..!

#boyapati-srinu #anil-ravipudi #chiranjeevi-upcoming-movies-list #chiranjeevi-upcoming-movies #trivikram #chiranjeevi #megastar-chiranjeevi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe