Megastar Birthday Treat: మెగాస్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌.. అర్థరాత్రి ''విశ్వంభర'' అదిరిపోయే ట్రీట్‌!

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్నవిశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. గురువారం ఉదయం 10.08 గంటలకు మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్‌ ఇస్తున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది.

New Update
Megastar Birthday Treat: మెగాస్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌.. అర్థరాత్రి ''విశ్వంభర'' అదిరిపోయే ట్రీట్‌!

Megastar Birthday Treat: టాలీవుడ్ పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి పలు అప్డేట్స్‌ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మూవీ టీం రెడీ అయ్యింది. అందులో భాగంగానే బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఓ పోస్టర్‌ ను విడుదల చేశారు.

అందులో ఉదయం 10 గంటల 08 నిమిషాలకు మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్డేట్‌ ఏంటి అనేది మాత్రం వాళ్లు చెప్పలేదు. కానీ అది ఓ చిన్న టీజర్‌ కట్‌ అని మాత్రం ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఆంజనేయుడి ముందు గదతో విశ్వంభరుడు ఉన్న టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు టీజర్ కట్ ఇంకా చేయలేదని కేవలం పోస్టర్ మాత్రమే బయటకు రాబోతుందని అంటున్నారు. వినాయక చవితికి టీజర్ రిలీజ్ చేస్తారని ఈరోజు రిలీజ్ చేయబోయేది పోస్టర్ మాత్రమే అనే క్లారిటీ ఇచ్చారు. ఆ పోస్టర్లో ఆంజనేయుడు ముందు గదతో విశ్వంభర నిలబడిన పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక అర్ధరాత్రి 12 గంటల సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్లో నదిని ఆనుకుని ఉన్న కొండమీద విశ్వంభరుడిగా మెగాస్టార్ ఆ కొండను ఎక్కుతున్నట్టుగా విడుదల చేశారు. ఈ సినిమాని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తూ ఉండగా యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చెల్లెళ్ళుగా పలువురు టాలీవుడ్ భామలు కనిపించబోతున్నారు. మొత్తానికి మెగా అభిమానులకు వశిష్ట అర్ధరాత్రి ట్రీట్ ఇచ్చాడు.

Also Read: అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్‌ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య!

Advertisment
తాజా కథనాలు