Pawan Kalyan : పవన్‌ ప్రమాణ స్వీకారం..స్పెషల్‌ బస్సులో వచ్చిన మెగా కుటుంబం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. పవన్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది.

New Update
Pawan Kalyan : పవన్‌ ప్రమాణ స్వీకారం..స్పెషల్‌ బస్సులో వచ్చిన మెగా కుటుంబం!

Andhra Pradesh : ఏపీలో నేడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల (Alliance Parties) నేతలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రాంతీయ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

అటు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా , జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. దీంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాటిని క్లియర్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ (PM Modi) సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.ఫిలిం ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ సతీసమేతంగా చేరుకోగా స్టేట్ గెస్ట్ హోదాలో మెగాస్టార్ చిరంజీవి కూడా సభాస్థలికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Also read: ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యమ లక్కీ.. నాడు వైసీపీలో ఎమ్మెల్యేలు, నేడు టీడీపీలో మంత్రులు!

Advertisment
తాజా కథనాలు